Saturday, 29 August 2015

ముక్డి...

నీ ఒడిలో తల వాల్చిమనసు విప్పి మాటాడినీ కౌగిలిలో సేదతీరాలని
నీవు నా తల నిమరగనీ కనులలోకి చూసిఆత్మీయత లోతు తెలుసుకోవాలని
పౌర్ణమి వెన్నెల్లో నీ గుండెల్లో తలవుంచిపసిపాపలా నిదురించాలని
నేనల్లరి చేయగ, కోపించిననీ కన్నులలోని చిలిపిదనాన్నితనివితీరా చూడాలని ఆశగా వుందితీర్చవూ ...ప్లీజ్ 
ముక్డి...

నీ ఒడే ఊయలగా  నీ ఊపిరి వింజామరగాయద సవ్వడి జోల పాటగా బిగి కౌగిలి నులి వెచ్చగానీ ప్రేమ లో నిచ్చింతగానిద్రొవాలి  జీవితాంతం ..   

నీ నిరీక్షణలోనే ఎక్కువ ప్రేమిస్తున్నానేమో ముక్డి..

నీతోఉన్న ప్రతిక్షణం  పోట్లాడాలనిపిస్తుంది
నువ్వెళ్లిన మరుక్షణమే  మాట్లాడాలనిపిస్తుంది
నీ సమక్షంలోకంటే నీ నిరీక్షణలోనే ఎక్కువ ప్రేమిస్తున్నానేమో ముక్డి...

నన్నర్ధం చేసుకోవట్లేదని కోప్పడతాను కాని నిజానికి నాకు నేనే అర్ధంకావట్లేదని ఎలా చెప్పను నీకు ?
ఏకాంతపు వాకిట్లో మౌనంగా నీ తలపుల రంగవల్లులు దిద్దుతూ నిదురరాని నిశిరాత్రులు గడుపుతున్నానని ఎవరు చెప్తారు నీకు.....

Sunday, 23 August 2015

నేను నిజంగా పిచ్చివాడినే. ...

హాయ్ ముక్డి,

ఎలా వున్నావురా...?
నీవు లేకుండా నేను అస్సలు బాలేను.
ఎలా వుండగలుగుతున్నావురా నేను లేకుండా...?
ఎందుకో తెలియడంలేదు అనుక్షణం నిన్నే చూడాలనిపిస్తుంది.
కేవలం నిన్నే చూడాలనిపిస్తుంది. నీ గురించిన వూహలు నన్ను అనుక్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
నీ జ్ఞాపకాల దొంతరలను నా చుట్టూ పరచుకుని పరచుకుని వాటిని చూస్తూ మురిసిపోతుంటాను.
నా మనసులోని భావాలను అక్షరాలుగా పేర్చి నీ మెడలో వేయడానికి దండగా గుచ్చుతున్నాను.

నువ్వు నీ నవ్వు, నీ చూపు, నీ మాట, నీ పేరు ప్రతీదీ నాకు అపురూపమే.
నీవు నన్ను చూసే క్షణాన నా మనస్సు పొందే సంతోషం మాటలలో చెప్పలేనురా.
నీవు కనిపిస్తే నా కళ్ళల్లొ కోటి సూర్యుల కాంతి, కనిపించకపోతే ఏదో కోల్పోయిన భ్రాంతి. ఏమిట్రా ఇది...?
నాకే ఎందుకు ఇలా అవుతుంది...?
నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోతున్నాను. అయినా అది నాకు ఇస్టంగానే వుంది.
ఇక్కడ నీకోసం అనుక్షణం ఎదురు చూస్తూ వుంటే అంతా నన్ను పిచ్చివాడు అంటున్నారు. నిజమా..?
ప్రేమించడం పిచ్చితనం అయితే నేను నిజంగా పిచ్చివాడినే.

ఈ పిచ్చివాడికీ ఒక మనసుంటుందనీ అది ఎల్లప్పుడూ నీ కోసమే పలవరిస్తుందని వారికేం తెలుసు...?
వారేమంటున్నారంటే, ఒక అమ్మాయి నిజంగా మనస్పూర్తిగా ప్రేమించినట్లయితే, తను ప్రేమించిన వాడిని కమ్యూనికేట్ చేయడానికి ఎలా అయినా ప్రయత్నిస్తుంది అని మరి నువ్వు ఎందుకు ప్రయత్నించడం లేదు.
నువ్వు పరిస్తితులు అంటున్నావు. నా కోసం నీ ప్రాణానైనా ఇస్తానన్న దానివి. నీ గుండెల్లో నా మీది ప్రేమను ఎలా దాచేయగలుగుతున్నవో నాకు అర్ధం కావడం లేదు.
అంతలా ప్రేమించిన ఇలా కూడా వుండగలరా అనిపిస్తుంది. ఆడపిల్లలంటే అంతేనా.....??
కానీ నా గుండె చిన్నదిరా, నీ మీది ప్రేమ దానిని నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీదగ్గరే వుండాలని, నీ కళ్ళల్లొకి చూస్తూ, నీ పలుకులు వినాలనిపిస్తుంది.
నీ పరిచయం నన్ను ఎంతలా మార్చింది.
ప్రతీక్షణం నీ ధ్యాసే, నీ వూహే. నేను నీలా మామూలుగా వుండలేక పోతున్నాను. అందరితోనూ కలసివుండే నేను ఇప్పుడు ఎవ్వరితోనూ సరిగా కలవలేక పోతున్నాను.
ఒంటరిగా వుంటూ నీ వూహలలోనే గడుపుతున్నాను. చివరకు ఏమైపోతానో నాకే తెలియడం లేదు. ఎందుకురా నాకు నువ్వంటే నాకింత ప్రేమ....


ప్రేమ తో  నీ............................®మహి 

Saturday, 22 August 2015

గుర్తొస్తున్నవ్వ్ ముక్డి...

ఊ..బెంగగా ఉంది..
చాలా బెంగగా ఉంది..
నువ్వు చాలా గుర్తొస్తున్నవ్వ్ ముక్డి......
నువ్వు తప్ప వేరే ఇంకేం గుర్తుండటం లేదు తెలుసా..!
అబ్బబ్బా.. అసలు నీతో వచ్చిన చిక్కే ఇది. వద్దు వద్దని పట్టి ఆపాలని ప్రయత్నించే కొద్దీ ఇంకా ఇంకాఎక్కువ గుర్తొచ్చేస్తుంటావ్..

అసలెందుకిలా...?
హుమ్మ్.. ఇప్పటికి ఈ ప్రశ్నవెయ్యి సార్లయినా వేసుకుని ఉంటాను. కానీ ఏం లాభం.. ఎంతగా తర్కించుకున్నా సమాధానమే తోచదు ఎంతకీ..
నీ ఆలోచనలు నన్నొదిలి పోవా కాసేపైనా..!
నువ్వు పరిచయమైన కొత్తలో ఇంతపిచ్చిగా నీ మోహంలో పడి కొట్టుకుపోతుంటే..
ఏదోలే మహా అయితే నాలుగు రోజులు వేధిస్తావ్..
ఆ తర్వాత మాములైపోతాను కదా అనుకున్నా. కానీ, ఎక్కడా.. ఈపిచ్చి రోజు రోజుకీ పెరిగేదే గానీ తగ్గేది కాదేమోననిపిస్తోంది..
నీకు నవ్వొస్తోంది కదూ! అసలు అలా ఎలా ఉండగలవ్ నువ్వు.. మాటలన్నీ లోపలేదాచేసుకుంటే అవన్నీ గొంతులో అడ్డం పడిపోతున్నట్టూ.. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడిపోతున్నట్టు ఉండదా నీకు..? చాలా చిత్రమైన అమ్మాయివి  అసలు నువ్వు..
అన్నీటికీ నవ్వేనా సమాధానం...? అసలా కళ్ళల్లో ఏదో వింత మెరుపు ఉంటుంది.. చూసీ చూడగానే మాయలో పడేస్తుంది.
నేనింతలా రోజుల తరబడి నీ ఊసే తలచుకుంటూ నీ కోసంపిచ్చిగా ఆరాటపడిపోతుంటానా.. నువ్వేమో తీరిగ్గా ఎప్పటికో కనిపించి మహాతేలిగ్గా చిన్నినవ్వొకటి నా మీద విసిరేసి నీ చూపులతో మాయ మంత్రం ఒకటి వేసి నేనలా మైకంలోఉండగానే చక్కా జారుకుంటావు.. పెద్ద మాయదానివి నువ్వసలు....

ఏంటో ఈ అమ్మాయి  మీద ఇష్టమో, మోహమో, ప్రేమో, ఆరాధనో అర్థం కాదు. ఒకోసారి నేనూ, తనూ వేరు కాదేమో అనిపిస్తాడు. అద్దంలో కనిపించే ప్రతిబింబం మాదిరిమా ఇద్దరిలోనూ దాగున్నది ఒకటే ఆత్మేమో అనిపిస్తుంది.
తనతో ఏదైనాపంచుకోగలనన్నంత దగ్గరితనం, చనువూ ఉన్నాయనిపిస్తుంది. అంతలోనే అల్లరిచేస్తున్న చిన్ని పాపాయిని కళ్ళతోనే చిన్నగా భయం చెప్పి హద్దుల్లోఉంచుతున్న భావన, అంతలోనే గుండెల మీదకి అక్కున చేర్చుకుని నులి వెచ్చనినిశ్చింతని అందించే అనునయం, అంతలోనే ఉన్నట్టుండి సుడిగాలిలా చుట్టేసిఊపిరాగిపోయేలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ బిగి కౌగిలిలో బంధించేసే దుడుకుతన.  .. రామచంద్రా...

హుమ్మ్.. ఎన్నాళ్ళైనా ఈ అమ్మాయి  మాయని చేధించలేకపోతున్నానే ..!
పైగా ఈమాయలో ఉండటమే చాలా ఇష్టంగా తోస్తోంది. ఎవరి ముందైనా సరే కనీసం కనురెప్పలైనావాల్చని నేను నీ ముందు మాత్రం ఎందుకిలా అయిపోతున్నాను. నేను అన్న స్పృహపూర్తిగా కోల్పోతున్నాను. ఎందుకిలా నీకు దాసోహమన్నట్టు అయిపోతున్నాను? కానీ, అలా నీ ముందు ఓడిపోవడంలోనూ, నీలో ఒదిగిపోవడంలోనూ ఎంతో సంతోషాన్నీ, సంతృప్తిని అనుభూతిస్తున్నాను. ఎందుకు నువ్వంటే ఇంతిష్టం అని ఎంతగాశోధించినా అంతు పట్టదు. అయినా నా పిచ్చి గానీ ఇష్టాలకి కారణాలుంటాయా..హేవిటో.. తెలిసిన విషయాలే మర్చిపోతున్న పరధ్యానం, నిన్ను మరచిపోతున్నాననుకుంటూ పదే పదేనీ చుట్టూనే తిరిగే పరవశం.. నా మనసుకి బాగా అలవాటయ్యాయి ఈ మధ్య. సరే.. నా వల్లఎలాగూ కావట్లేదు కదా.. అసలీ ప్రశ్నలన్నీ నీ ముందు ఉంచితేనో.. ఏముందీ..మళ్ళీ ఒక చిన్ని నవ్వే బదులుగా వస్తుంది నీ నుంచి.. ఏదీ సరిగ్గా చెప్పవేం అసలు..హుమ్మ్.. అయినా అసలు ఆచెప్పీ చెప్పకుండా చెప్పినట్టు చెప్పకపోవడంలోనే ఉందనుకుంటా నీ మాయంతా.. దొంగ పిల్ల

Monday, 29 June 2015

ముచ్చటైన మన ఇద్దరి కలయిక..

మాట్లాడకు అన్నంత మాత్రన
మరిచిపోతానని అనుకుంటున్నావా ..

మరు జన్మకై నేను వేచి యున్నాను...
మిగిలిన  రోజులు మ్రింగి లేకున్నాను ..

ముచ్చటైన మన ఇద్దరి కలయిక
మరువలేకున్నాను...
నిన్ను నేను మరువలేను .....!!

Sunday, 28 June 2015

ఐ నీడ్ యు....

ఎన్ని  జన్మలైనా ఎదురు  చూస్తాను
నా జతవుతానంటే ...

ఏడు సంద్రాలైన దాటి వస్తాను
ఏడు అడుగులు వేస్తానంటే...

కనురెపాలో  నిన్ను దాచేస్తాను
నా కనుపాప నీవై అయితే ...

ఒక సారి నీ చేయినిస్తే కడసారిదాక తోడుంటా...     
 "" నీడ్ యు ఫరెవర్  ముక్డి "

Thursday, 25 June 2015

నాకు PROPOSE చేయటం రాదు ..!

నాకు  ప్రేమించటమే తెలుసు
PROPOSE చేయటం రాదు ..!
 ప్రేమ అనేది ఓ హృదయ స్పందన..
సంగీతానికి సంతోషానికి, దుక్కనికి హృదయం
ఏ విధంగానయితే స్పందిస్తుందోఅదే విధంగా ఎదుటి వారి ప్రేమను హృదయం గమనిస్తుంది స్పందిస్తుంది...

అలాంటప్పుడు "I LOVE U" అని express చేయటం లో అర్ధం లేదు
నువ్వు చెబితే గాని నీ ప్రేమ గురించి ఎదుటవారికి తెలియనప్పుడు ..
అస్సలు నీ దగ్గర ప్రేమనేదే లేదు ..
నా ప్రేమను గుర్తించండి అటునావు అంటె,
ఏదో కనపడనిది , నీ దగ్గర ఎక్కడో దాగిన ఒక దానిని వెతికి పట్టుకోమనటమే అవుతుంది.

నువ్వు మనస్పూర్తిగా ఎవరినయన ప్రేమించినట్లు అయితే వాళ్ళకి నేను ప్రేమిస్తున్నాను అని చేపల్సినా అవసరం లేదు.
నీ ప్రేమ వాళ్ళకి కనిపిస్తుంది వినిపిస్తుంది ,వాళ్ళ హృదయాన్ని స్పందింపచేస్తుంది..


for example :
ప్రపంచం లోనే అత్యున్నత ప్రేమ ఎవరిది అంటె ..
ఎవరయినా చెపుతారు తల్లి ప్రేమ అని ,కాని,
ఆ తల్లి ఎప్పుడు తన బిడ్డతో "ఒరేయి కన్న నేను నిన్ను ప్రేమిస్తున్నాను రా ", "నువుంటే నాకు చాల ఇష్టం రా" అని అంటుందా ...?
ఆ బిడ్డకు తెలియదా తన తల్లి ప్రేమ ...!

మీరనవచ్చు ..తల్లి ప్రేమకు, పిల్ల ప్రేమకు తేడ లేదా అని ,
నిజమయినా ప్రేమ ఎప్పుడు తల్లి ప్రేమ అంత స్వచ్చామయింది..
మీకు తేడ కనిపిస్తే మీ ప్రేమ ను సందేహించాల్సిందే .....
ప్రేమ అనేది మనం చేసే పనులలోను ప్రవర్తించే తీరుల్లోను ,
చూపే అభిమానం ఆత్మియతలపై ఆధారపడి ఉంటుందే కానీ
మనం చెప్పే I LOVE U లోను ....
ఎవ్వరో రాసినా రాతలను ఇవే నా feelings అని
ఇచ్చే greeting cards లోను లేదు ....
Ur ..............................®మహి 

Tuesday, 23 June 2015

ఇల్లాలికి నా ప్రేమాలేఖ ...

ముక్డి....

ఓయ్ దొంగపిల్లా... ముక్డి  అనే పిలుపు చూడగానే ముసి ముసి నవ్వులతో మురిసిపోతున్నావు కదూ..?
నాకు తెలుసులే... మన స్నేహం తొలినాళ్లలో నీ పేరు పెట్టి పిలిచేందుకే మహా ఇబ్బంది పడిపోయిన నేను..
మనం ఒక్కటైనాక ప్రేమగా ముక్డి ముక్డి  అంటుంటే నీకెంత సంబరమో..
నీకు తెలీదుకానీ నాక్కూడా చాలా సంతోషంగా ఉంటుంది అలా పిలుస్తుంటే...

ఓయ్ తుంటరి పిల్లా... ఏం చేశావో నీకు తెలీదా... ?
ఏం చేశాను అని అలా బుంగమూతి పెట్టమాకు..నేనే చెబుతాలే.
అయినా సరే నీ మీద ఎంతగా ప్రేమ పెరిగిపోయిందో మాటల్లో చెప్పలేను.
నువ్వు ఏమైనా రాస్తే కేవలం ఆ మాటలు మాత్రమే ఆ లేఖలో ఉండేవి. కానీ ఏమీ రాయకుండా నువ్వు అలా వదిలేసి ఖాళీగా పంపిన లేఖలో నేను ఎన్నింటిని నింపుకున్నానో...
నువ్వే రాసినట్లుగా ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా మార్చి మార్చి చదువుకున్నానో.....
ఇదుగో ఆ లేఖ ఇప్పుడు నా చేతిలో అలాగే భద్రంగా..
అదేంటో ఆనాటి భావనే ఇప్పుడూ.. అక్షయపాత్ర లాంటి నీ ప్రేమని ఎంత ఆస్వాదించినా..
ఇంకా ఎంతో మిగిలే ఉందని అనిపిస్తుంటుంది..

నువ్ ఊరెళ్లగానే....... ఫోన్లు, మెసేజ్‌లు, ఈ మెయిళ్లు ఇవన్నీ ఇప్పట్లో రొటీనే కదా.. కాస్త వెరైటీగా మనం అందరం ఎప్పుడో మర్చిపోయిన లెటర్లో అందంగా అల్లిన అక్షరాల మాలల్ని పేర్చి నీకు బహుమతిగా అందిస్తే.... ఓహ్.. ఊహే భేషుగ్గా ఉంది.. దాన్ని నిజం చేద్దామని పెన్నూ, పేపర్‌తో సిద్ధమై..
మెల్లిగా సిరాని అక్షరాల్లో ఒలికిస్తూ మెుదలెట్టిన "నీ శ్రీవారి ప్రేమలేఖ"
ఇదుగో...

అయినా నీ దిగులంతా నాకు తెలుసులెండి శ్రీమతిగారు..
నేను ఒంటరిగా ఉంటానని,నా అవసరాలు ఎవరు చూస్తారని తమరి దిగులు.
అయినా నేను ఒంటరినని ఎవరన్నారు నీతో...?
నువ్వెప్పుడూ నా పక్కనే ఉంటుంటే నేను ఒంటరినెలా అవుతానే పిచ్చీ..
రోజూ బలవంతం చేసి, బుజ్జగించి మరీ తినిపించే నా బుజ్జమ్మ లేకపోయినా,
నువ్వే దగ్గరుండి అన్ని పనులూ చేస్తున్నట్లు ఫీల్ అవుతూ...
ఎంత చక్కగా పనులన్నీ చేసేసుకుంటున్నానో తెలుసా...?
నువ్వు చూస్తే.. ఎంతగా మెచ్చుకుంటావో...

నువ్వు గుర్తు వచ్చినప్పుడు నీ చీరని చుట్టుకుని పడుకుంటే.. అదేంటో చిత్రం.. అచ్చం నీ పక్కనే పడుకుని ఎంచక్కా కబుర్లు చెబుతున్నట్లు..
నేను చెప్పే కబుర్లను వింటూ మిలమిలా మెరుస్తూ, అటూ ఇటూ కదలాడే నీ మీనాల్లాంటి కళ్లని చూస్తున్నట్లు అనిపిస్తోంది..
ఎన్నెన్ని కబుర్లో.. చెప్పి, చెప్పీ ఎప్పుడో అలసిపోయి నిదురబోయిన నేను..
ఉదయాన్నే కళ్లు తెరిచి చూసేసరికి నీ ఒడిలో ( నీ చీరలో ముఖం దాచుకుని) హాయిగా బజ్జోనుంటాను. ఇంట్లో నువ్వున్నప్పుడు ఎలా కబుర్లు చెబుతుంటానో అలా కబుర్లు చెప్పుకుంటూనే పనులన్నీ చకచకా కానించి, ఆఫీసుకు పరుగులెడుతున్నాను. చూశావా.. ఎంత బుద్ధిమంతుడో నీ శ్రీవారు...
"అబ్బా చాల్లేద్దూ... మావారికి దిష్టి తగులుతుంది" అంటున్నావు కదా..

నాకు తెలుసు ముక్డి ,
ఇంత రాత్రి గడుస్తున్నా... నాకు ఇంకా ఇంకా రాయాలని అనిపిస్తోంది బుజ్జమ్మా. ఎన్ని జ్ఞాపకాలో, మరెన్ని అనుభూతులో కదా..
నేనేమీ ముక్డిని  కాను బ్లాంక్ లెటర్ పంపేందుకు..  అయ్యగారు మాంచి మూడ్‌లో ఉన్నారు.. ఎన్ని పేజీలైనా అలవోకగా ఇట్టే రాసేయగలరు.
ఈ లేఖ ఎవరైనా చదివితే ఎలా అని భయపడే ప్రేమికుడి స్టేజ్ దాటిపోయి అయ్యగారు శ్రీవారి స్టేజ్‌లో ఉన్నారు కాబట్టి..
ఎవరికీ భయపడే పనేలేదు. నువ్వీ లేఖ చదువుకున్నా ఎవరికీ భయపడాల్సిన పనిలేదు. మొగుడూ పెళ్లాలు వాళ్ల ఇష్టం అని మన పెద్దాళ్లు( మీ అన్న) ముసిముసిగా నవ్వుకుంటూ బయటపడతారు.

కానీ.. లేఖ ఇంతకంటే ఎక్కువ రాయాలంటే కష్టంగా ఉంది.
అదేంటి పెళ్లానికి ప్రేమలేఖ రాయటం కష్టమా... అందుకే
కూసింత స్వార్థంతో ఇప్పటికిలా లేఖను ముగించేస్తున్నాను.
బుంగమూతి బుజ్జమ్మా... అర్థం చేసుకుంటావుగా..
అయినా నువ్వు నా ముక్డివిగా .. ఎప్పుడో అర్థం చేసుకుని అప్పుడే పడుకునేశావా.. అమ్మో... ఎంతైనా ముక్డి , ముక్డమ్మె ....
లవ్ యూ ముక్డి .. హాయిగా బజ్జో తల్లీ....!

నా హృదయ దేవతవి..

ప్రియమైన ముక్డి..

నేను నిన్ను చూడక ముందు నువ్వొక మాములు మనిషివి.
చూసాక ........ అందమైన  జ్ఞాపకానివి ...

నేను నిన్ను ఆరాదించక ముందు నువ్వొక సగటు అమ్మాయివి .... ఆరాధించాక....... నాలోని ప్రేమ మూర్తివి ...

నేను నిన్ను ప్రేమించక ముందు నువ్వొక శిలా ప్రతిమవి...
ప్రేమించాక..... నా హృదయ దేవతవి...

నేను నీతో మాట్లాడక ముందు నువ్వొక నిశ్శబ్ద సముద్రానివి....
మాట్లాడాక .... నువ్వొక అలల సవ్వడివి ....

చూసావా ముక్డి ... నీ విలువ నేను ప్రేమించడం లోనే ఉంది...
 ఇంత చిన్న విషయాన్నీ నీవెప్పుడు గుర్తిస్తావు ..... ??

మనకోసం కొత్త ప్రపంచాo..

ప్రియమైన ముక్డి,

ఇక్కడ నీవు లేవు కాని...ఈ గది లోనిప్రతి అణువు ని ఉనికినే గుర్తుకు తెస్తున్నాయి.
చల్లగా నను స్పృశించిపోయే చిరుగాలిఎక్కడ నీ ప్రియమైన ముక్డి  అని అడుగుతుంది.
వాకిట్లో పూసిన సన్నజాజులు నీకోసమే ఎదురుచూస్తున్నట్లున్నాయి.

యదనిండా నీ తియ్యని జ్ఞాపకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి
ఎపుడెపుడు నిను చూస్తానా అని మనసు మారాం చేస్తుంది.
ఆకాశం లోని నక్షత్రాలు నీ కళ్ళలో కనిపించే కాంతి రేఖలై నికు నాకు మధ్య పెనవేసుకున్న ఈ ప్రేమ బంధాన్ని కాంతివంతం చేస్తున్నాయి.

మనం కలిసి నడిచే బాటలోని పూలుమన ప్రేమకి శుభాకాంక్షలు చెబుతుంటే.
నీ చేతిలో నా చెయ్యి నీ అడుగులో నా అడుగు ఒకరిమీద ఒకురు పెంచుకున్న ప్రేమ, అభిమానం ఇద్దరిదీ ఒకే మాట ఒకటే ప్రాణంనికు బాధ కలిగితే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి.

నేను దిగులుగా వుంటే నీ మనసుకు బాధ కలుగుతుంది.
ఈ బంధం ఇలాగే కలకాలం నిలిచిపోవాలని....
నీలో సగభాగంగా నేను మిగిలి పోవాలి అని
నీకోసం నేను నాకోసం నువ్వు 
మనకోసం ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించుకొని
మనం ఆశించిన ఉన్నత స్ధాయి కి ఎదగాలి అని
మనస్తూర్తిగా కోరుకుంటున్న...

Monday, 22 June 2015

కాబోయే నా శ్రీమతికి ముక్డికి “ ప్రేమలేఖ ”

 ప్రియమైన శ్రీమతి ముక్డి కి,

నిన్ను చూడకుండానే.నీ ప్రేమలో పడిపోయాను,
అసలు నువ్వు ఎక్కడ ఉన్నవో తెలియదు,
ఎలా ఉంటావో తెలియదు,
నా కళ్ళతో నిను చూడలేకపోవచ్చు,
నీ మాటలు వినలేకపోవచ్చు,నీస్పర్శను పొందలేకపోవచ్చు.

కానీ...
ప్రతిక్షణం నిన్నే తలచుకుంటూ...
నీ ఆలోచనలలో గడుపుతూ...
నీ కళ్ళల్లోకి చూసేఆ క్షణం కోసం....
అనుక్షణం తపిస్తున్నాను.
ఇది ప్రేమే కదా...

కానీ ఈ ప్రేమ మొదలుకాక ముందే...
విరహాన్ని పరిచయం చేసావు.
నా కళ్ళు నీ కోసం ఎదురుచూస్తున్నాయి,
అద్దం ముందు నన్ను నేను చూసుకుంటుంటే,
నా కళ్ళల్లో నువ్వు కనిపిస్తున్నావు...
నిజం, నువ్వు ఎవరో ఇంకా తెలియకపోయినా....
నిరంతరం నా ఉహల్లో నువ్వే...
నా శ్వాసలో సైలెన్స్ నువ్వు,  నా గుండె చప్పుడులో  రిథం నువ్వు,
నా నిద్ర లో కల నువ్వు,

ఇంకా చెప్పాలంటే నా ప్రాణం నువ్వు,
నీకోసం కనే కలలే ఇంత అద్భుతంగా ఉంటుంటే,
నా లైఫ్ లో నువ్వు...
నీ కోసం నిరీక్షణలో క్షణమొక యుగంలా గడుస్తుంది. హృదయమంతా నిండిన ఆ ప్రేమని,
ఒక్క చిన్న మాటతో నీకు చెప్పాలని...
చిన్న ఊహతో మొదలైన నా ప్రేమ,
సముద్రమంత ప్రేమగా...
మన ప్రేమగా మారాలనీ...నా చిన్ని ఆశ.

ఎప్పుడు పూస్తుందో తెలియని గులాబి కోసం,
ప్రతిరోజు ఎంతో ఆప్యాయంగా నీళ్ళు పోసి,ఎలా పెంచుకుంటామో… నా ప్రేమ కూడా అంతే...
భవిష్యత్తులో ఎర్రగులాబీ తోటలా విరబూసేమన ప్రేమ కోసం,  ప్రేమతో… నా ప్రేమను,  ప్రేమగా పంచుతున్నాను.
నీపై బెంగతో...  మా డాబాపై సన్నజాజితీగ చిక్కిపోయింది,
నా గులాబి మొక్క ఒక్క పువ్వు కూడా పూయడం లేదు,
పున్నమి రోజు చందమామ తొంగి తొంగి చూస్తున్నాడు,నువ్వు వచ్చావేమో అని...

సాగరానికి కోపం నిన్ను తీసుకుని రాలేదని,
నా అడుగులను చెరిపేస్తున్నాడు...
ముళ్ళు గుచ్చుకుంటాయని తెలిసినా,
గులాబిని పట్టుకుంటాము...
ఆ గులాబి ముళ్ళు గుచుకున్నప్పుడు వచ్చే తీయని బాదే....
ఈ ప్రేమలేఖ...

నీకోసం నిరీక్షిస్తూ...                                                                           .                                 ప్రేమతో.........................®మహి  

నా బుజ్జికొండకి ప్రేమ లేఖ ..

ప్రియమైన ముక్డి ,

నాకెంతో ఇష్టమైన ఒక మాట నీతో నేరుగా చెప్పడం కష్టం అనిపించి ఇలా రాస్తున్నా ఈ లేఖ .
ఒకప్పుడు నీ గురించి అందరూ చెబితే విని నీ కోసం కలలు కనేవాడిని
నిన్ను కలవాలని కష్టపడేవాడిని .
నిన్ను కలుస్తానని తెలిసిన ఆ రోజు ,
ఆనందంతో ఆకాశం దాకా ఎగిరి అందుకున్న ఓ నక్షత్రం ఇంకా నా నవ్వుల్లోనే మెరుస్తుంది .
నీ చిరు గాలులతో , చల్లని చినుకులతో నన్ను పలకరించి నీ గుండెల్లో తొలి స్థానం నాకిచ్చావు .

నువ్వు అందంగా వుంటావని అందరూ అన్న విషయం అబద్ధం అని తేలిపోయింది .
అందం అనే పదానికి నీ పేరు పక్కన ఉండే అర్హత కూడా లేదు అనిపించింది , అంత అద్భుతంగా వున్నావు .
ఆ తొలి చూపులోనే నాకు నువ్వు ఎంతో నచ్చేశావు .
(తొలి చూపు అంటే YRP లో చూసినపుడు )ఆ రోజు నుంచి
ప్రతి నిమిషం ,
ప్రతి క్షణం నేను చేసే ప్రతి పనిలో నువ్వున్నావు .
నీ చుట్టూ నన్ను తిప్పించావు ,
నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వచ్చావు .
నీలో అనువనువునా నాకు ఆనందమే కనిపించింది,
ఎంత వెతికినా నన్ను నేను కలుసుకున్నట్టే అనిపించింది .
నీ శ్వాసల వడగాలులలో మండిన రోజులున్నాయి ,
నీ నవ్వుల చినుకులలో తడిసిన రోజులున్నాయి ,
నీ చూపుల చలిలో వణికిన రోజులున్నాయి .

నీ మాటతో మనసు మెల్లగా మంచులా కరిగిపోయింది ,
నీ బాటలో ఆశ ఆకాశం అంచు దాకా వెళ్ళిపోయింది .
నా పక్కనే కూర్చుని కబుర్లు ఎన్నో చెప్పావు ,
నేను ఏడిస్తే ఓదార్చవు ,
కోప్పడితే క్షమించావు ,
అలిగితే బుజ్జగించావు .
అసలు నేను నేనన్న విషయం నాకు నువ్వే చెప్పావు .

అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం .
నిన్ను వదిలి చాలా సార్లు వెళ్ళా కానీ ఎప్పుడూ బాధ పడలేదు , ఎందుకంటే మళ్ళీ కలుస్తాననే నమ్మకం ఉండేది .
ఆ ఒక్క మాట చెప్పేయమంటుంది మనసు .
అందుకే నిన్ను వదిలి వెళ్ళిపోవాలన్న బాధనీ ,
నిన్ను వదిలి ఉండలేనేమోనన్న భయాన్నీ గుండెల్లో దాచలేక ఇలా చెప్పేస్తున్నా .
నువ్వు నన్ను మర్చిపోవని నాకు తెలుసు ,
నేను నిన్ను మర్చిపోలేనని నీకు తెలుసు .
అసలు నువ్వు లేని నేను లేను ,
నువ్వు నాతో వుంటే నాకు నేను అవసరమే లేను .
ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే         
     " I LOVE YOU . ఐ  లవ్  యు"


ఇట్లు ,      
                 నీ.............................®మహి 

నా మనసంతా నువ్వే..

మాట బయటకు రాదు. 
ఎన్నో అడగాలనుకుంటాను.. అసలు గుర్తుండదు .

ఏదో జరుగుతోంది నాలో, అది నీకే తెలియాలి.. !

ఏదో కావలనివుంది నాకు, అది నువ్వేనేమో..!

మనసు విప్పి చెప్పలేని ఊసులు,అడగలేని విషయాలుఎన్ని ఉన్నా....

ఒకటి మాత్రం ఎప్పటికీ నిజం ,

నా మనసంతా నువ్వే ముక్డి..!!

అందులోని
ప్రతి ఊసు, 
ప్రతి ఊహ,
ప్రతి భావం, 
ప్రతి అనుభవం ,
అన్ని నువ్వే, ముక్డి  నువ్వే..!!

Sunday, 21 June 2015

ప్రేమ...

ప్రేమ గురించి రాయటం మొదలెట్టినప్పటి నుండి ఈ మధ్య చాలా మంది అడుగుతున్నారు
ఇంతకి నువ్వు ప్రేమించిన ఆ అమ్మాయి ఎవరు అని...!
నాకెందుకో ఎప్పుడు ప్రేమించాలనే ఆలోచనే రాలేదు,
ఎందుకంటే ప్రేమంటే ఇది అని కచ్చితమైన అవగాహన నాకిప్పటికి రాలేదు
ఫ్రెండ్ ప్రేమ అముల్యమైనదిఅందుబాటు ఉన్నపుడే ఆస్వాదించాలి
ఒక్కసారి ప్రేమ దూరమైతే ప్రపంచానికి దూరమైనంత బాధగా ఉంటుంది...
మీకు ఒక్కోసారి అనిపిస్తుంది కదు...!
(ప్రేమలో ఉన్న వాళ్ళు, ప్రేమలో పడ్డ వాళ్ళు).ప్రేమ గురించి రాయటానికి కచ్చితంగా ప్రేమించాల్సిన అవసరం లేదేమో...
ప్రేమని ఆస్వాదించినా చాలేమో...
ప్రేమంటే ఒక అమ్మాయికి అబ్బాయికి మధ్య ప్రేమే కానవసరం లేదుమనసున్న ఏ రెండు హృదయాల మధ్య అయినా ఉండొచ్చు....
నేను ఆస్వాదిస్తున్నాను అందుకే రాస్తున్నాను. 

Saturday, 20 June 2015

నీప్రేమాపై నమ్మకముంచు

ముక్డి....

నాపై కోపముంటే నాపై చూపించు
కానీ నీపై కోపం పెంచుకోకు..

నాపై ద్వేషముంటే నన్ను ద్వేషించు
కానీ నిన్ను భాధ పెట్టుకోకు ..

నాకు దూరం అవ్వాలనుకుంటే దూరమైపో
కానీ నిన్ను నువ్వు దూరం చేసుకోకు ..

నాపై నమ్మకం లేకున్నా సరే
కానీ నీపై నీప్రేమాపై నమ్మకముంచు ...

ఏంటి నీ మాయ....

ప్రేమంటే ఏంటో తెలియకుండానే ప్రేమించాను ...
మనసంటే ఏంటో పూర్తిగా తెలియకుండానే మనసిచేసాను ...
కానీ నేనంటే ఏంటో నాకు తెలిసి కుడా నాలో నేను ఉండలేకపోతున్నాను ... 

ముక్డి ఏంటి నీ మాయ....?

నీతొ..గడపాలి

నీతొ గడపాలి - సమాయనికి చిరాకు వచ్చేవరకు...
నీతొ  మట్లాడాలి - బాషలన్నిటిలొ పదాలు నిండుకొవాలి...
నీతొ నడవాలి - దూరనికి విసుగు వచ్చెవరకు...
నీతొ నవ్వాలి - ఆనందానికి ఏడుపు వచ్చెవరకు...
నీతొ జీవించాలి   - స్వర్గానికే  అసుయవచ్చెవరకు...
నీ. ..............................................మహి


..

ఏన్ని జన్మలకైనా నీ తోడుగా వస్తాను ..

నా చేయ్యి పట్టుకుని నువ్వు నడవకపోయిన .. 
నిన్ను నడిపించే అడుగు నేనవుతా ..
నాతో నీవు ఏడడుగులు నడువకపోయిన ..
ఏన్ని జన్మలకైనా నీ తోడుగా వస్తాను ..
వేద మంత్రాలు లేకపోయినా ..
నాహృదయాన్ని నీకు వేదికగా మారుస్తాను ..
నీకు పసుపు తాడు కట్టకపోయినా ..
నా ప్రాణం పోస్తాను ...
నీ కన్నీళ్లలో ఆనందాన్ని అవుతాను ..
నీ ఆనందానికి తోడునవుతా నా ప్రేమ నీకు శాశ్వతం ...
ప్రేమా ..... తో ......నీ............
మహి 

Friday, 19 June 2015

ఎంగేజ్మెంట్ అయినవాణ్ణి ..

నన్ను అట్ల సూడమాక-అసలే ఎంగేజ్మెంట్ అయినవాణ్ణి ..®మహి

ఓహో అందాల బాల..

ఓహో అందాల బాల_నీకు అద్దంతో పనేల...!

ఏం ప్రేమ నిచ్చావే నా మనసుకి..

ఏం మాయ చేసేవే నా గుండెకి,
నను వీడి చేరింది నీ గూటికి.

ఏం సోగసు చూపేవే నా కంటికి,
జగమంత నిను చూపింది నా చూపుకి.

ఏం మంత్రం వేశవే నా పెదవికి,
నీ పేరు తపిస్తుంది ప్రతి ఘడియకు.

ఏం ప్రేమ నిచ్చావే నా మనసుకి,
గతమంత తొలిచింది ఆ బరువుకి.

ఏం విరహం పంచావే నా ప్రేమకి,
నను ఒంటరిని చేసింది లోకానికి

Thursday, 18 June 2015

ఎలా ఉంది నీ కలల ప్రపంచం....?

హాయ్ ముక్డి ,

ఏం చేస్తున్నావు....?
నిన్నట్నుండి సరిగ్గా మాట్లాడటం వీలు కుదరలేదు.
ప్రాణాన్నేదో తొలిచేస్తున్నట్టు ఉంది.
లోలోపల ఏదో జ్వరం వచ్చినట్టు ఉంది ఈ బెంగ.
నీ ఒడిలో తలవాల్చి కాసేపు ఏడవాలనిపిస్తుంది.
ఎందుకంటావా?

నీ వేళ్ళతో తల నిమురుతావని.
కళ్ళలోకి చూస్తూ కాసేపు కబుర్లు చెప్పుకోవాలనుంది..!
ఫొన్ లో మాట్లాడటానికే కుదరదాయే ఇక ఇవన్నీ కూడానా...?
అని నవ్వొస్తుంది నా పిచ్చికి.

ఈ పాటికి నిద్రలోకి జారుకుని ఉంటావు.
నిద్రపోయేప్పుడు నువ్వెలా ఉంటావో...!
పెదవులమీది చిరునవ్వు చీకట్లోకూడా మెరుస్తూనే ఉంటుందా...? మేలుకుని ఉన్నప్పుడైతే నా తలపులవల్ల పూసిన మెరుగనుకుంటాను.
మరి నిద్రలో...?

ఓ నా గురించి కలలుకంటున్నావా....?
ఎలా ఉంటుంది నీ కలలప్రపంచం....?
నన్ను కాస్త తొంగిచూడనివ్వవూ....?
ఏ పువ్వులవనంలో నా తలపుల సీతాకోకల వెంటబడి తిరుగుతుంటావో...
ఏ ఏటివొడ్డునో తడి ఇసుకలో నిన్నాటపట్టిస్తూ పరుగు తీసిన నన్ను పట్టుకోవాలని నా వెనుక పరుగెత్తి అలసిపోయి గసపోస్తుంటావో
ఏ మసక సంధ్యవేళో నన్ను కలుసుకుని నీ వేళ్ళని నా వేళ్ళకిచ్చి, ప్రపంచాన్ని చీకట్లో వదిలెళ్ళిన సూరీడికి పోటీబడే నీ జత కళ్ళతో నా ప్రపంచాన్నిమాత్రం వెలుగుపరుస్తుంటావో
ఏ వానకాలంలోనో కోకిలలు మూగబోయాయని తియ్యని గొంతుతో ప్రియరాగాలాలపిస్తూ నాకు వీనుల విందులు చేస్తావో

Wednesday, 17 June 2015

నా శ్రీమతికి ప్రేమలేఖ...

ప్రియమైన నా ముక్డికి ....!!

ఎలా ఉన్నావ్ ,
సరిగ్గా తింటునవా లేదా ..?
లాల్లి చెప్పింది అక్కడ ఇండియాలో చాలి ఎక్కువ అంటా కదా..
నువ్వు చాలి లో తిరగకు . మళ్లి నీకు జాల్లుబు చేస్తే ఒక పట్టాన  తగ్గదు ..

ఏంట్రా ముక్డి  అంత దూరం  వెళ్ళిపోయావు ,
అసలు నిన్ను లైవ్ లో చూసి ఎన్ని రోజులైందో తెలుసా ..?

ఎన్ని వారాలు ,
ఎన్ని గంటలు ,
ఎన్ని  నిమిషాలు ,
ఎన్ని సెకండ్స్ అయ్యయో  లెక్క వేసి గాని చెప్పలేను,
ఎందుకంటే నేను మాథ్స్ లో  వీక్  కదా ..!!
కానీ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉంటాయో అన్ని సెకండ్స్ అయ్యి ఉంటాయి....?
సముద్రంలో ఎన్ని చేప పిల్లలు ఉంటాయో అన్ని నిముషాలు అయ్యి ఉంటాయి ...?
అడవిలో ఎన్ని పక్షులు ఉంటాయో అన్ని గంటలు అయ్యి ఉంటాయి....?
ఒక్కోసారి అనిపిస్తుంది క్షణాలు ఒక యుగాలు అంటే ఇదేనేమో అని ..!!

రోజు నా కళ్ళ ముందు ఉన్నట్టే ఉంటావు ,
కానీ నీ జుట్టు చేరపాలని నిన్ను పట్టుకో బోతే మాయం అయిపోతావు...?
ఏంటో నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను ముక్డి మరి నువ్వు ..??
నాకు దూరంగా ఉండటం చాలా భాదగా ఉంది ముక్డి ..!!

ఓ sorryఅల అంటే నువ్వు భాద పడుతావు ..
లేదు లేదు ముక్డి నేను చాల హ్యాపీగా ఉన్నాను.
ఎందుకో తెలుసా ....?
నేను ఇండియాలో ఉన్నప్పుడు మనం రోజు ఇలానే మాతలాడుకొనే కొన్ని గంటలు మాత్రమే నువ్వువు నా మాటల్లో నా తలపుల్లో ఉండే దానివి..
ఎందుకంటే రేపు ఉంది కదా అనే ధ్యర్యం,
నువ్వు ఎప్పటికి నన్ను వదిలి వెళ్ళవు అనే నిశ్చింత ..
అదే ఇప్పుడు నా24 గంటల సమయాన్ని నువ్వు బిజీగా ఉంచుతున్నావు .
ఇప్పుడు నా మాటల్లో ,
నా చూపుల్లో ,
నా తలపుల్లో ,
నా చిరునవ్వుల్లో ,
నువ్వు నాకు రోజు కనిపిస్తున్నావు ..!!


ముక్డి నీకొకటి తెలుసా ...?
మొన్న అమ్మకు కాల్ చేస్తే ముక్డితో మాట్లాడుతునవా అని అడిగింది . వాళ్ళకు కూడా నీకు కాల్ చేయను అని తెలుసు ...
వెన్నెల వెచ్చగా ఉంటుంది ,
ఎందుకంటే దానికి చల్లా దనాన్ని ఇచె నీ చిరునవ్వు నాతో  లేదుకదా సయం కాలాలు చప్పగా ఉంటున్నాయి ,
ఎందుకంటే దానికి తియ్యదనాన్ని ఇచే నీ చక్కిలిగింతలు నాతో లేవుకదా..
ఏంటో నీతో చేరి నేను కవితాలు చెప్పేస్తున్నా ..!!

ముక్డి ..!!
తెలుసా  మొన్న ఇక్కడ వర్షం వచ్చింది ..
నాకు వర్షం అంటే ఇష్టం వర్షంలో తడవలి అనుకున నువ్వు గుర్తోచావ్ తిడుతావ్ అని తడవలేదు .
"నాకు నీ కనురెప్పల గొడుగు పడుతాను " అని చిలిపిగా చెప్పే దానివేమో అని ...
ఉదయం అయితే చాలు నిన్ను చూడాలి అనిపిస్తుంది ..

అందమైన ఉదయమా .....
నీ కిరణాల్ల వెలుగులో తన చిలిపి కనులు చూపించవా ...?
ఓ నా వెచ్చటి మధ్యాహ్నమా ....
నీ వెచ్చదనంలో తన వెచ్చటి కౌగిలింతని రుచి చుపించావా ..?ప్రియమైనా సాయంత్రమా ...
నీ కమ్మని నీరెండలో తన అల్లరి చిరునవ్వు నాకు అందివ్వవా ..
నా వెన్నెల కురియని రాత్రమ్మ ....
తన జోలపాటతో నా రాత్రిలో వెన్నెల కురిపించవా ....
ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఇలానే తలచుకుంటూ ఉన్నాను తెలుసా .... !!

నాకో నాది (సముద్రం ) కావాలని ఉంది ..
అప్పుడు ఈ దూరలన్నింటిని దాటి నీ దగ్గరకు త్వరగా చేరుకోగలను కదా ..
నాకు పిల్ల గాలిని కావాలని ఉంది ..
అప్పుడు నువ్వు పీల్చే గాలిలో అజరామరమై నేను ఉంటాను కదా ఏంటో ముక్డి ,
నువ్వు  ఎప్పుడు వస్తావు అనే తపనతో ,
నీ  కలల తోనే నా రోజులు గడిచిపోతున్నాయి ,
నా కోసం ఎన్ని భాదలైన భరించగలను అని ఆరోజు నీ కళ్ళలో చుసిన భావం నా మనసు నుంచి దూరం కాగలదా ... !!

Yrpలో నువ్వు  కలిసి ప్రేమగా నాతో మాట్లాడావ్ చూడు అప్పుడు
నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమ నేను ఎప్పటికి మర్చిపోలేను ..
నన్ను నువ్వు ప్రేమిస్తున్నాను అని చెప్పే మాట కోసం నీతో పరిచయం ఐన మొదటి రోజు నుంచి wait చేస్తున్న తెలుసా ....?
నీకేమో చెప్పడానికి 2 ఇయర్స్ పట్టింది ..
ఎంగేజ్మెంట్ చేయకుంటే చెప్పేదానివి కాదేమో ...

ముక్డి ... !!
లయబద్దంగా నర్తించే నా హృదయపు కవాటాల్లో చప్పుడు చేయని మాత్రా చందస్సువి నువ్వు..!!
జీవిత గమనపు రెండు సంధ్య గట్టులని ఒరిసి ప్రవహించే నిశబ్ద ఝురివి  నువ్వు ...!!
ప్రణయంలో తియ్యటి సరిగామవాయ్ నా జీవితాన్ని పరినయపు సరిహద్దుల వరకు తీసుకు వచ్చిన విపంచివి నువ్వు ...!!
నీ సహచర్యంలో నా జీవితాన్ని ఉదయ రాగంలో రేగే ప్రత్యూష పవనమ్ల మార్చుకోవాలని అనుకుంటున్నాను...!!
మరి నీకు అర్ధం అవుతుందా...!

నిన్ను ప్రేమిస్తున్నాను అని రాయకుండానే నాకు అర్ధం కాని తెలుగు poetryలో ప్రేమిస్తున్నాను అని ఎంత బాగా చెప్పావు...
ఇన్ని తీపి జ్ఞాపకాలని నేను ఎవరితో అయిన ఎలా పంచుకోగాలను ...
నాలో ప్రాణ వాయువు కదా  నీప్రేమా ...!

"ప్రపంచంలో వర్ణాలు అన్ని ఒక్కటైనంత అందంగా ఉంటుంది  నువ్వు నా పక్కన ఉంటె ...!
ప్రకృతి లోని ఆనందం అంతా నా అరచేతుల్లో  ఉంటుంది,
నవ్వుకుంటునవా ముక్డి ....?
ఈ మెంటల్లోడికి పిచ్చి పట్టిందా అని ...?
నిజమే రా, నీకు చాలా చెప్పాలని Nzbకి వచ్చాను,కాని చెప్పలేకపోయాను.గుర్తోస్తున్ననా ....??

నేను ని పక్కనే  ఉన్నారా..
నీ చేయి చూడు  , నీ చేతి వెళ్ళాను నా చేతి వేళ్ళతో గట్టిగా పట్టుకొని ఉన్న నేను కనిపిస్తాను ..
ఆకాశంలో నక్షత్రాలు చూడు,నీకోసం నవ్వుతు ఎదురుచూసే నా కళ్ళ కనిపిస్తాయి..
వర్షించే చినుకులను తాకు, ...
ప్రతి చినుకు నీకు నా ప్రేమను గుర్తు చేస్తాయి...
సాగరంలో దారి తెలియని నావలా...
గగనంలో చంద్రుడులేని తారకలా ...
కొలనులో తోడులేని ఒంటరి చేపలా...
ప్రేమ అనే పచదనంలేని చెట్టులా ..
నీకు దూరంగా వున్నా తెలుసా ... !!
నువ్వంటే అంతా ప్రేమా నాకు ..
అందుకే ఈ ప్రేమలేఖ...
ఎలా రాయాలో ,
ఏమి రాయాలో తెలియదు...
కాని నా ఈ బ్లాగ్ & "ప్రియా నా గుండె లయ"లో
ప్రతి పేజి నీకోసమే .........

ఇట్లు ,     
                   ప్రేమ తో .......నీ ............®మహి

Tuesday, 16 June 2015

శుభలేఖలు

ఎన్నాళ్లీ ప్రేమలేఖలు_ఇక రాసేద్దాం
శుభలేఖలు ..

ఇదే నా మొదటి ప్రేమలేఖ..

ప్రియాతి ప్రియమైన శ్రీమతి ముక్డి కి,
నా చేత ప్రేమలేఖ వ్రాయించుకునే అదృష్టం నీదే మరి ఎందుకంటే..... ఇదే నా మొట్టమొదటి ప్రేమలేఖ

అలాగని నేను శ్రీ రామచంద్రుణ్ణి అని చెప్పలేను....
నా రేంజికి తగ్గట్టు ఏదో ఒకరో,ఇద్దరికి రాసి ఉంటా ..
ఇదిగో ఇలా అర్ధరాత్రి మూడింటికి నిద్రపట్టక ప్రేమలేఖ రాయాలనిపించే సీన్ ఐతే లేదు అమ్మడు ఎవ్వరికీ

ప్రేమలేఖ... అంటే ఏం రాయాలి...?
మనం ప్రేమికులం కాదు కదా...!!
పోనీ పెళ్ళికి ముందు తెగ ఫోన్లు చేసుకుని మాట్లాడుకున్న వాళ్ళమూ కాదాయె...!
కానీ ఏదో రాయాలని ఆరాటం.
నా రాతల్లో నిన్ను చూసుకోవాలని ఉబలాటం.
పోనీ కవితలు రాద్దామంటే....
మనకి కపిత్వం తెల్సుగాని... కవిత్వం తెలీదే...!
పాటలు రాద్దామంటే.... ఆ పాండిత్యమూ లేదు..!అందుకే....
నా మనసులో ఇప్పటికిపుడు నీగురించి వచ్చిన ఆలోచనలన్నీ అక్షరాల్లో పెట్టేస్తున్నా..! సరేనా...!

అదిసరేగాని, అసలు ఏం మాయచేసావ్ ముక్డి  నన్నూ..?
పోనీ నిన్ను చూసిన మొదటిసారే డుబుక్కున ప్రేమలో పడిపోయాను అంటే అదీ కాదు...

కానీ, మన నిశ్చితార్ధం రోజున నీ చేతి వేళ్ళు చూడగానే మాత్రం ముద్దొచేసాయంటే నమ్ము..!
మరీ ఎక్కువసార్లు చూశానేమో రెండుమూడు రోజులు కల్లో కూడా అవే వచ్చాయ్ [ ఎక్స్ట్రా ఫింగర్స్ ] ఆ చేతివేలికి ఉంగరం తొడిగే అదృష్టం నాదే అంటేనే అదొక గొప్ప ఫీలింగ్.... ఎవరెస్టు అధిరోహించేసినట్టు...!

నిశ్చితార్ధం చేసుకొని 15 రోజులకే .సౌదీ బయలుదేరితే.... నీ కళ్ళలో దిగులు చూస్తే.... ఎంత ఆనందమేసిందో తెల్సా...?
అవును మరి...! నాకోసం ఆలోచించే మనిషి ఒకరున్నారనే భరోసా
ఆ దిగులే...! నన్ను కావాలనుకునే వాళ్ళు ఉన్నారనడానికి సాక్ష్యం
ఆ దిగులే... అందుకే నాకు అది నచ్చింది.
కానీ ఆ దిగులు నాకూ అంటుకుని ఇదిగో ఇలా వేధిస్తోంది...!
నీతో గడిపిన ఆ రెండు రోజులు ఇవే నాకు ఇప్పుడు తిండి-నీళ్ళు-నిద్ర.... తెల్సా...??
ఎన్నిసార్లు నీ ఫోటో చూసినా... ఎంతసేపు నీతో ఫోన్లో మాట్లాడినా...వాట్స్అప్ లోచాట్ చేసినా... ఏదో వెలితి గుండెని మెలిపెట్టేస్తోంది. ...

నీకో సీక్రెట్ చెప్పనా...? అసలు పెళ్ళంటేనే నాకు చిరాకు. హాయిగా బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నన్ను... మా అమ్మ 'అమ్మాయి బంగారంలా ఉంది. చిదిమి దీపం పెట్టుకోవచ్చు. ఒక్కసారి ఫోటో చూసి చెప్పరా!' అంటే.... ఇల్లదిరిపోయేలా అరిచా... 'అప్పుడే నాకు పెళ్ళేంటి?' అని. నీ ఫోటో చూపిస్తే చిరాగ్గా చూసి... 'మ్..సరే' అని ముక్తసరిగా సమాధానం చెప్పా! ఏదో ఒకటి పెళ్లి చేసుకుంటే ఈ టార్చర్ తప్పుతుందని. కానీ.... నిజ్జంగా నిజం.... మొదటిసారి నిన్ను చూసినప్పుడు మాత్రం.... మా అమ్మ టేస్ట్ మెచ్చుకోకుండా ఉండలేకపోయా...

కానీ.... నీకు అంత నమ్మకమేంటి నామీద...?
ఫోన్ లో నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని అడిగాను ఆ? ఎంత గడుగ్గాయివో!! ఎలాగైతేనేం.... బుట్టలో వేసేసుకున్నావ్ నన్ను!!

నీకేమి గిఫ్ట్ ఇవ్వలేదు నేను...అందుకే నీకోసం ఈ ప్రేమలేఖ వ్రాస్తున్నా! ఇదే నేను నీకివ్వబోయే మొదటి గిఫ్ట్
నాగురించి అన్ని రాసుకున్నావ్ కదా నువ్వు.... కానీ నీగురించి రాద్దామంటే..... నీ ఊహల్లో మునిగిపోవడమే తప్ప.... కాగితం మీద కలం కదిలితేనే కదా!
ఇదిగో... ఇన్నాళ్టికి అర్ధరాత్రి కుదిరింది ముహూర్తం
 ఎప్పుడో మర్చిపోయిన అక్షరాలన్నీ కూడబలుక్కుని రాస్తున్నా! నీ అంత అందంగా,కుదురుగా రాయడం కుదరట్లేదు... తిట్టుకోవు కదా!

నేను నిశ్చితార్ధంకి  ముందు.. ఇలాగే ఒంటరిగా ఉండేవాడిని. ఇప్పుడూ నా పరిస్థితిలో మార్పు లేదు. కానీ నా మనసులో మాత్రం బోలెడు మార్పు. చెప్పలేనంత మార్పు. ఆఫీసు-తిండి-నిద్ర తప్ప పట్టని నాకు.. ఊహలు నేర్పావు. కవితలు నేర్పావు. ప్రేమించడం నేర్పావు. విరహం అంటే ఏమిటో చూపిస్తున్నావు. ఇదిగో.... ఇలా ప్రేమలేఖ కూడా రాయించేస్తున్నావు!!
ఇన్ని ఇచ్చిన నా చెలి ... నా దగ్గరికి తొందరగా వచ్చెయవూ??వచ్చేస్తావు కదూ.... బంగారం!
నీకోసం ఎదురు చూస్తూ....
నీ శ్రీవారు...................మహి ....

నాతో ఏడు అడుగులు నడుస్తావ ...

నేను పది అడుగులు వేస్తా,
నీవు ఒక అడుగైనా వేయగలవా....?
అడుగులేగా ... వేయలేనా..... ?
అని అంటే పొరపాటే...
అహంకారం తగ్గించుకోవడానికే .. ఆ అడుగులు
ఇక సహకరించేనా నీ పాదాలు.... ??
నాకు అనుమానమే ...
నీ పాదం కదిలేది అణు మాత్రమే ....!!
ప్రేమా తో ...నీ ............మహి ..

పిచ్చివాడా...

పిచ్చివాడా ..
నీ లక్ష్యం అంటే ప్రేమ పోయి ..
అమ్మాయి ప్రేమ గుండెల్లోకి చేరే ...
ఆ ప్రేమ నిను ప్రేమించలేదుట ..
మరొకరి పంచన చేరిందిట ..
నీ ఆశలు వెక్కిరించగా..
విగత జీవిగా మిగిలావట ..
ఇక నేర్చుకో మరి పాఠం ..
మరచిపో ఉబలాటం ...
నీకై ఎదురుచూసే నీ తదుపరి గమ్యం ..
అది నీవు మరచిపోయిన  "జీవిత లక్ష్యం"
మీ ........................ మహి

సంస్కారం....

నాకు జీవితానుభవం అంతగా లేదు....కానీ

నిడారంబరంగా జనం బ్రకనివ్వరని విన్నా!

డాబు, దర్పం, దర్జాలకి పీటవేసి కూర్చోమన్నా

క్రింద కూర్చోవడం అలవాటులేక నిలుచున్నా...

కాళ్ళునొప్పి పుట్టి నిలబడలేక వెళదామనుకున్నా

సంఘజీవివి కదా సంస్కారంతో మెలగాలనుకున్నా
''మనం పోగొట్టుకొనేంత సమయం మన దగ్గర లేదు.
 అందుకనే మనం అవకాశం గురించి తొందరపడాలి..
 మనం కాలయాపన చేసేంత ధనవంతులం కాదు...''- రవీంద్రనాథ్ ఠాగూర్

Monday, 15 June 2015

నీ ...... ప్రేమాఖైది

నా ఫోన్ ట్రింగ్ ట్రింగ్ అని మోగుతోంది,
ఫోన్ చేసింది నువ్వే అనుకున్నా....
నా ఫోన్ లో మెస్సేజ్ వచ్చింది అది చేసింది నువ్వే అనుకున్న...
బైక్ పై అలా వెళ్తూ ఉంటే ఓయ్...బావ అని శబ్దం వినిపించిది పిలిచింది  నువ్వే అనుకున్నా,
అలా వీధిలో నడుస్తున్నా,వెనక నుండి ఎవరో తడిమినట్టు అనిపించింది అది నువ్వే అనుకున్నా......
నువ్వు నాకు దూరంగా ఉన్నా....
నా మది మాత్రం నీ ద్యాసలోనే....ప్రతి క్షణం.
నా మదిలో నీకు చోటిచ్చాను,
ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను మరి
నీ మదిలో ఉన్న నన్ను మాత్రం దూరంగా ఎందుకు పెడుతున్నావు...
నా ప్రేమంటే అలుసా.......లేక
నా ప్రేమ నీకు తెలియకన......??
రోజు రోజు కి నాలో ఒంటరితనం ఎక్కువ అవుతుంది,
అది నీ వల్లే...............ముక్డి ..
ఇట్లు ,       
           నీ ..................... ప్రేమాఖైది మహి .......

నీవచట కుశలమేనా.....

ప్రియతమా...!

నా ఆశల బాసలన్నీ
కలల కవితలన్ని
ఊహలన్ని పాటలై
మాటలలో తెలియజెప్పడానికి బాషే తెలియక
హృదయ లయ తప్పుతోంది.  


నీవచట  కుశలమేనా .....
ప్రియా...!


పదే పదే నీతో ఏదో చెప్పాలని,
మనసు కేరింతలు కొడుతూంటే...
పెదవి కదలడం లేదు!


ప్రతి క్షణం నిన్నుకలవాలని - నీ తోనే ఉండాలని,
తనువూ పులకిస్తోంటే...
ఎద లో కొత్త కలవరింతలు మొదలవుతున్నవి!
రోజు నీ మాటలే ఎంతసేపైనా వినాలని
నీతోనే ఉండాలని వుంటుంది
కొంచము దూరం ఇక వద్దనుకుంటా
మరో క్షణమే నీవే కావాలని వుంటుంది

ఎంమాయో నన్ను ఆవహించిందో
గాలిలో తేలి నట్లున్నది
ఉన్నట్లుండి నాలో నేనే నవ్వు కుంటున్నా
నిన్ను వీడి ఎ  వైపు వెళ్ళలేక  ఉంటున్నా.

నీకు తెలుసా...

నీకు తెలుసా....?
రాత్రి ప్రపంచం కౌగిలిలో నిద్రిస్తుంటే
హఠ్టాత్తుగా గుర్తుకొస్తావు మెళకువ వస్తుంది....
నా పిచ్చి కానీ నిను విడిచి నా మది ఏనాడు విశ్రమించిందనీ
ప్రేమ ప్రేమిస్తుందే తప్ప ద్వేషించదు
జీవితానికి జీవం పొసేది ప్రేమా .....

బాధ.....

ఆమె నా జీవితం లోకి వచ్చేంతవరకూ
 గుండెల్లో ఎవరూ లేరే అన్న బాధ
వచ్చాక…తనను నా ప్రేమలో
 ముంచెత్త లేకపోతున్నానే అన్న బాధ
నా ప్రేమను తనపై కురిపించినా
 తను తీసుకోలేకపోతుందే అన్న బాధ

నా మనసు  కనిపించడం లేదు ముక్డి..

నా మనసు  కనిపించడం లేదు ముక్డి ...
నువ్వేమైన పట్టుకేల్లవా......?
మమకారంతో రాసుకున్న నా కవితలున్నాయి..
కొమ్మ కొమ్మ కు రాసుకున్న జ్ఞాపకాలున్నాయి..
సముద్రపు అలలూ చేసే సవ్వడులు ఇంకా నాకు గుర్తున్నా..
మనసు పడికొనుక్కున్న శ్రీశ్రీ రచనలు ఇంకా నాకు గుర్తున్నా..
అస్తమించే సూర్యుడితో పాటు , ఎరుపెక్కే సాయం కాలం మధ్యచెప్పుకున్న ఎన్నో కథలు గుర్తున్నాయి ...
అన్ని అలాగే ఉన్నాయి...కాని
నా మనసు మాత్రం లేదు...
ముక్డి, నీమీదే అనుమానం గా ఉంది...
ఈ మధ్య నువ్వోచావు కదా.. నా మనసేమైనా పట్టుకేల్లవా .....???

కడ దాకా నీ కొసమే వేచి చూస్తూ

మరణపు అంచున నిల్చున్నా సరే
   నీ తలపులతొనే నింపి ఉంచుతా నా హ్రిదయాన్ని ముక్డి …
 నా గుండె మూగ బొతున్నా సరే నా కల్లల్లో నిలిపి ఉంచుతా కొన ఊపిరిని ….
    కడ దాకా నీ కొసమే వేచి చూస్తూ …
   ఇట్లు,
             ప్రేమా .....తో ...నీ .......మహి