Monday, 22 June 2015

నా బుజ్జికొండకి ప్రేమ లేఖ ..

ప్రియమైన ముక్డి ,

నాకెంతో ఇష్టమైన ఒక మాట నీతో నేరుగా చెప్పడం కష్టం అనిపించి ఇలా రాస్తున్నా ఈ లేఖ .
ఒకప్పుడు నీ గురించి అందరూ చెబితే విని నీ కోసం కలలు కనేవాడిని
నిన్ను కలవాలని కష్టపడేవాడిని .
నిన్ను కలుస్తానని తెలిసిన ఆ రోజు ,
ఆనందంతో ఆకాశం దాకా ఎగిరి అందుకున్న ఓ నక్షత్రం ఇంకా నా నవ్వుల్లోనే మెరుస్తుంది .
నీ చిరు గాలులతో , చల్లని చినుకులతో నన్ను పలకరించి నీ గుండెల్లో తొలి స్థానం నాకిచ్చావు .

నువ్వు అందంగా వుంటావని అందరూ అన్న విషయం అబద్ధం అని తేలిపోయింది .
అందం అనే పదానికి నీ పేరు పక్కన ఉండే అర్హత కూడా లేదు అనిపించింది , అంత అద్భుతంగా వున్నావు .
ఆ తొలి చూపులోనే నాకు నువ్వు ఎంతో నచ్చేశావు .
(తొలి చూపు అంటే YRP లో చూసినపుడు )ఆ రోజు నుంచి
ప్రతి నిమిషం ,
ప్రతి క్షణం నేను చేసే ప్రతి పనిలో నువ్వున్నావు .
నీ చుట్టూ నన్ను తిప్పించావు ,
నేను ఎక్కడికి వెళ్ళినా నాతో వచ్చావు .
నీలో అనువనువునా నాకు ఆనందమే కనిపించింది,
ఎంత వెతికినా నన్ను నేను కలుసుకున్నట్టే అనిపించింది .
నీ శ్వాసల వడగాలులలో మండిన రోజులున్నాయి ,
నీ నవ్వుల చినుకులలో తడిసిన రోజులున్నాయి ,
నీ చూపుల చలిలో వణికిన రోజులున్నాయి .

నీ మాటతో మనసు మెల్లగా మంచులా కరిగిపోయింది ,
నీ బాటలో ఆశ ఆకాశం అంచు దాకా వెళ్ళిపోయింది .
నా పక్కనే కూర్చుని కబుర్లు ఎన్నో చెప్పావు ,
నేను ఏడిస్తే ఓదార్చవు ,
కోప్పడితే క్షమించావు ,
అలిగితే బుజ్జగించావు .
అసలు నేను నేనన్న విషయం నాకు నువ్వే చెప్పావు .

అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం .
నిన్ను వదిలి చాలా సార్లు వెళ్ళా కానీ ఎప్పుడూ బాధ పడలేదు , ఎందుకంటే మళ్ళీ కలుస్తాననే నమ్మకం ఉండేది .
ఆ ఒక్క మాట చెప్పేయమంటుంది మనసు .
అందుకే నిన్ను వదిలి వెళ్ళిపోవాలన్న బాధనీ ,
నిన్ను వదిలి ఉండలేనేమోనన్న భయాన్నీ గుండెల్లో దాచలేక ఇలా చెప్పేస్తున్నా .
నువ్వు నన్ను మర్చిపోవని నాకు తెలుసు ,
నేను నిన్ను మర్చిపోలేనని నీకు తెలుసు .
అసలు నువ్వు లేని నేను లేను ,
నువ్వు నాతో వుంటే నాకు నేను అవసరమే లేను .
ఇంకా అర్ధమయ్యేలా చెప్పాలంటే         
     " I LOVE YOU . ఐ  లవ్  యు"


ఇట్లు ,      
                 నీ.............................®మహి 

No comments:

Post a Comment