నా మనసు కనిపించడం లేదు ముక్డి ...
నువ్వేమైన పట్టుకేల్లవా......?
మమకారంతో రాసుకున్న నా కవితలున్నాయి..
కొమ్మ కొమ్మ కు రాసుకున్న జ్ఞాపకాలున్నాయి..
సముద్రపు అలలూ చేసే సవ్వడులు ఇంకా నాకు గుర్తున్నా..
మనసు పడికొనుక్కున్న శ్రీశ్రీ రచనలు ఇంకా నాకు గుర్తున్నా..
అస్తమించే సూర్యుడితో పాటు , ఎరుపెక్కే సాయం కాలం మధ్యచెప్పుకున్న ఎన్నో కథలు గుర్తున్నాయి ...
అన్ని అలాగే ఉన్నాయి...కాని
నా మనసు మాత్రం లేదు...
ముక్డి, నీమీదే అనుమానం గా ఉంది...
ఈ మధ్య నువ్వోచావు కదా.. నా మనసేమైనా పట్టుకేల్లవా .....???
No comments:
Post a Comment