Sunday, 23 August 2015

నేను నిజంగా పిచ్చివాడినే. ...

హాయ్ ముక్డి,

ఎలా వున్నావురా...?
నీవు లేకుండా నేను అస్సలు బాలేను.
ఎలా వుండగలుగుతున్నావురా నేను లేకుండా...?
ఎందుకో తెలియడంలేదు అనుక్షణం నిన్నే చూడాలనిపిస్తుంది.
కేవలం నిన్నే చూడాలనిపిస్తుంది. నీ గురించిన వూహలు నన్ను అనుక్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.
నీ జ్ఞాపకాల దొంతరలను నా చుట్టూ పరచుకుని పరచుకుని వాటిని చూస్తూ మురిసిపోతుంటాను.
నా మనసులోని భావాలను అక్షరాలుగా పేర్చి నీ మెడలో వేయడానికి దండగా గుచ్చుతున్నాను.

నువ్వు నీ నవ్వు, నీ చూపు, నీ మాట, నీ పేరు ప్రతీదీ నాకు అపురూపమే.
నీవు నన్ను చూసే క్షణాన నా మనస్సు పొందే సంతోషం మాటలలో చెప్పలేనురా.
నీవు కనిపిస్తే నా కళ్ళల్లొ కోటి సూర్యుల కాంతి, కనిపించకపోతే ఏదో కోల్పోయిన భ్రాంతి. ఏమిట్రా ఇది...?
నాకే ఎందుకు ఇలా అవుతుంది...?
నిన్ను తెలుసుకోవాలనే ప్రయత్నంలో నన్ను నేను కోల్పోతున్నాను. అయినా అది నాకు ఇస్టంగానే వుంది.
ఇక్కడ నీకోసం అనుక్షణం ఎదురు చూస్తూ వుంటే అంతా నన్ను పిచ్చివాడు అంటున్నారు. నిజమా..?
ప్రేమించడం పిచ్చితనం అయితే నేను నిజంగా పిచ్చివాడినే.

ఈ పిచ్చివాడికీ ఒక మనసుంటుందనీ అది ఎల్లప్పుడూ నీ కోసమే పలవరిస్తుందని వారికేం తెలుసు...?
వారేమంటున్నారంటే, ఒక అమ్మాయి నిజంగా మనస్పూర్తిగా ప్రేమించినట్లయితే, తను ప్రేమించిన వాడిని కమ్యూనికేట్ చేయడానికి ఎలా అయినా ప్రయత్నిస్తుంది అని మరి నువ్వు ఎందుకు ప్రయత్నించడం లేదు.
నువ్వు పరిస్తితులు అంటున్నావు. నా కోసం నీ ప్రాణానైనా ఇస్తానన్న దానివి. నీ గుండెల్లో నా మీది ప్రేమను ఎలా దాచేయగలుగుతున్నవో నాకు అర్ధం కావడం లేదు.
అంతలా ప్రేమించిన ఇలా కూడా వుండగలరా అనిపిస్తుంది. ఆడపిల్లలంటే అంతేనా.....??
కానీ నా గుండె చిన్నదిరా, నీ మీది ప్రేమ దానిని నిలువనివ్వడం లేదు. అనుక్షణం నీదగ్గరే వుండాలని, నీ కళ్ళల్లొకి చూస్తూ, నీ పలుకులు వినాలనిపిస్తుంది.
నీ పరిచయం నన్ను ఎంతలా మార్చింది.
ప్రతీక్షణం నీ ధ్యాసే, నీ వూహే. నేను నీలా మామూలుగా వుండలేక పోతున్నాను. అందరితోనూ కలసివుండే నేను ఇప్పుడు ఎవ్వరితోనూ సరిగా కలవలేక పోతున్నాను.
ఒంటరిగా వుంటూ నీ వూహలలోనే గడుపుతున్నాను. చివరకు ఏమైపోతానో నాకే తెలియడం లేదు. ఎందుకురా నాకు నువ్వంటే నాకింత ప్రేమ....


ప్రేమ తో  నీ............................®మహి 

No comments:

Post a Comment