హాయ్ ముక్డి ,
ఏం చేస్తున్నావు....?
నిన్నట్నుండి సరిగ్గా మాట్లాడటం వీలు కుదరలేదు.
ప్రాణాన్నేదో తొలిచేస్తున్నట్టు ఉంది.
లోలోపల ఏదో జ్వరం వచ్చినట్టు ఉంది ఈ బెంగ.
నీ ఒడిలో తలవాల్చి కాసేపు ఏడవాలనిపిస్తుంది.
ఎందుకంటావా?
నీ వేళ్ళతో తల నిమురుతావని.
కళ్ళలోకి చూస్తూ కాసేపు కబుర్లు చెప్పుకోవాలనుంది..!
ఫొన్ లో మాట్లాడటానికే కుదరదాయే ఇక ఇవన్నీ కూడానా...?
అని నవ్వొస్తుంది నా పిచ్చికి.
ఈ పాటికి నిద్రలోకి జారుకుని ఉంటావు.
నిద్రపోయేప్పుడు నువ్వెలా ఉంటావో...!
పెదవులమీది చిరునవ్వు చీకట్లోకూడా మెరుస్తూనే ఉంటుందా...? మేలుకుని ఉన్నప్పుడైతే నా తలపులవల్ల పూసిన మెరుగనుకుంటాను.
మరి నిద్రలో...?
ఓ నా గురించి కలలుకంటున్నావా....?
ఎలా ఉంటుంది నీ కలలప్రపంచం....?
నన్ను కాస్త తొంగిచూడనివ్వవూ....?
ఏ పువ్వులవనంలో నా తలపుల సీతాకోకల వెంటబడి తిరుగుతుంటావో...
ఏ ఏటివొడ్డునో తడి ఇసుకలో నిన్నాటపట్టిస్తూ పరుగు తీసిన నన్ను పట్టుకోవాలని నా వెనుక పరుగెత్తి అలసిపోయి గసపోస్తుంటావో
ఏ మసక సంధ్యవేళో నన్ను కలుసుకుని నీ వేళ్ళని నా వేళ్ళకిచ్చి, ప్రపంచాన్ని చీకట్లో వదిలెళ్ళిన సూరీడికి పోటీబడే నీ జత కళ్ళతో నా ప్రపంచాన్నిమాత్రం వెలుగుపరుస్తుంటావో
ఏ వానకాలంలోనో కోకిలలు మూగబోయాయని తియ్యని గొంతుతో ప్రియరాగాలాలపిస్తూ నాకు వీనుల విందులు చేస్తావో