ఊ..బెంగగా ఉంది..
చాలా బెంగగా ఉంది..
నువ్వు చాలా గుర్తొస్తున్నవ్వ్ ముక్డి......
నువ్వు తప్ప వేరే ఇంకేం గుర్తుండటం లేదు తెలుసా..!
అబ్బబ్బా.. అసలు నీతో వచ్చిన చిక్కే ఇది. వద్దు వద్దని పట్టి ఆపాలని ప్రయత్నించే కొద్దీ ఇంకా ఇంకాఎక్కువ గుర్తొచ్చేస్తుంటావ్..
అసలెందుకిలా...?
హుమ్మ్.. ఇప్పటికి ఈ ప్రశ్నవెయ్యి సార్లయినా వేసుకుని ఉంటాను. కానీ ఏం లాభం.. ఎంతగా తర్కించుకున్నా సమాధానమే తోచదు ఎంతకీ..
నీ ఆలోచనలు నన్నొదిలి పోవా కాసేపైనా..!
నువ్వు పరిచయమైన కొత్తలో ఇంతపిచ్చిగా నీ మోహంలో పడి కొట్టుకుపోతుంటే..
ఏదోలే మహా అయితే నాలుగు రోజులు వేధిస్తావ్..
ఆ తర్వాత మాములైపోతాను కదా అనుకున్నా. కానీ, ఎక్కడా.. ఈపిచ్చి రోజు రోజుకీ పెరిగేదే గానీ తగ్గేది కాదేమోననిపిస్తోంది..
నీకు నవ్వొస్తోంది కదూ! అసలు అలా ఎలా ఉండగలవ్ నువ్వు.. మాటలన్నీ లోపలేదాచేసుకుంటే అవన్నీ గొంతులో అడ్డం పడిపోతున్నట్టూ.. ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడిపోతున్నట్టు ఉండదా నీకు..? చాలా చిత్రమైన అమ్మాయివి అసలు నువ్వు..
అన్నీటికీ నవ్వేనా సమాధానం...? అసలా కళ్ళల్లో ఏదో వింత మెరుపు ఉంటుంది.. చూసీ చూడగానే మాయలో పడేస్తుంది.
నేనింతలా రోజుల తరబడి నీ ఊసే తలచుకుంటూ నీ కోసంపిచ్చిగా ఆరాటపడిపోతుంటానా.. నువ్వేమో తీరిగ్గా ఎప్పటికో కనిపించి మహాతేలిగ్గా చిన్నినవ్వొకటి నా మీద విసిరేసి నీ చూపులతో మాయ మంత్రం ఒకటి వేసి నేనలా మైకంలోఉండగానే చక్కా జారుకుంటావు.. పెద్ద మాయదానివి నువ్వసలు....
ఏంటో ఈ అమ్మాయి మీద ఇష్టమో, మోహమో, ప్రేమో, ఆరాధనో అర్థం కాదు. ఒకోసారి నేనూ, తనూ వేరు కాదేమో అనిపిస్తాడు. అద్దంలో కనిపించే ప్రతిబింబం మాదిరిమా ఇద్దరిలోనూ దాగున్నది ఒకటే ఆత్మేమో అనిపిస్తుంది.
తనతో ఏదైనాపంచుకోగలనన్నంత దగ్గరితనం, చనువూ ఉన్నాయనిపిస్తుంది. అంతలోనే అల్లరిచేస్తున్న చిన్ని పాపాయిని కళ్ళతోనే చిన్నగా భయం చెప్పి హద్దుల్లోఉంచుతున్న భావన, అంతలోనే గుండెల మీదకి అక్కున చేర్చుకుని నులి వెచ్చనినిశ్చింతని అందించే అనునయం, అంతలోనే ఉన్నట్టుండి సుడిగాలిలా చుట్టేసిఊపిరాగిపోయేలా ఉక్కిరిబిక్కిరి చేసేస్తూ బిగి కౌగిలిలో బంధించేసే దుడుకుతన. .. రామచంద్రా...
హుమ్మ్.. ఎన్నాళ్ళైనా ఈ అమ్మాయి మాయని చేధించలేకపోతున్నానే ..!
పైగా ఈమాయలో ఉండటమే చాలా ఇష్టంగా తోస్తోంది. ఎవరి ముందైనా సరే కనీసం కనురెప్పలైనావాల్చని నేను నీ ముందు మాత్రం ఎందుకిలా అయిపోతున్నాను. నేను అన్న స్పృహపూర్తిగా కోల్పోతున్నాను. ఎందుకిలా నీకు దాసోహమన్నట్టు అయిపోతున్నాను? కానీ, అలా నీ ముందు ఓడిపోవడంలోనూ, నీలో ఒదిగిపోవడంలోనూ ఎంతో సంతోషాన్నీ, సంతృప్తిని అనుభూతిస్తున్నాను. ఎందుకు నువ్వంటే ఇంతిష్టం అని ఎంతగాశోధించినా అంతు పట్టదు. అయినా నా పిచ్చి గానీ ఇష్టాలకి కారణాలుంటాయా..హేవిటో.. తెలిసిన విషయాలే మర్చిపోతున్న పరధ్యానం, నిన్ను మరచిపోతున్నాననుకుంటూ పదే పదేనీ చుట్టూనే తిరిగే పరవశం.. నా మనసుకి బాగా అలవాటయ్యాయి ఈ మధ్య. సరే.. నా వల్లఎలాగూ కావట్లేదు కదా.. అసలీ ప్రశ్నలన్నీ నీ ముందు ఉంచితేనో.. ఏముందీ..మళ్ళీ ఒక చిన్ని నవ్వే బదులుగా వస్తుంది నీ నుంచి.. ఏదీ సరిగ్గా చెప్పవేం అసలు..హుమ్మ్.. అయినా అసలు ఆచెప్పీ చెప్పకుండా చెప్పినట్టు చెప్పకపోవడంలోనే ఉందనుకుంటా నీ మాయంతా.. దొంగ పిల్ల